గుర్తు తెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి
నల్లగొండ, సెప్టెంబర్ 27 (విజయ కెరటం): ఈ నెల 15న నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ కార్గో సమీపంలోని రోడ్డుపై ఓ గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో దీనస్థితిలో పడి ఉండగా, 108 అంబులెన్స్ ద్వారా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ సదరు వ్యక్తి ఆదివారం (సెప్టెంబర్ 27) మృతి చెందాడు. మృతుడి వివరాలు, ఆచూకీ తెలియకపోవడంతో అతడిని గుర్తించేందుకు నల్లగొండ టూటౌన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యక్తికి సంబంధించిన ఆచూకీ లేదా కుటుంబ సభ్యుల వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే...