దివ్యాంగులకు ఉచిత సహాయక పరికరాలు.. నాలుగు రోజుల ప్రత్యేక శిబిరాలు
నల్లగొండ, సెప్టెంబర్ 26 (విజయ కెరటం): దివ్యాంగులకు అవసరమైన సహాయక పరికరాలను ఉచితంగా అందించేందుకు నల్లగొండ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు, అంచనా శిబిరాలను నిర్వహించనున్నారు. ALIMCO–హైదరాబాద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఈ శిబిరాలు జరుగుతాయని జిల్లా అధికారులు తెలిపారు. జిల్లాలోని 33 మండలాలకు చెందిన దివ్యాంగులను శిబిరాల్లో గుర్తించి, అర్హత ఆధారంగా బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, శ్రవణ పరికరాలు, స్మార్ట్ కేన్ తదితర సహాయక పరికరాల కోసం అంచనా వేయనున్నారు. శిబిరాల...