స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్గొండకు జాతీయ స్థాయి గుర్తింపు

కేటగిరీ–3లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ రూ.20 లక్షల నగదు బహుమతితో అవార్డు నల్లగొండ, సెప్టెంబర్ 7 (విజయ కెరటం): నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP)లో భాగంగా నిర్వహించిన వార్డు స్థాయి స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026లో నల్గొండ సత్తా చాటింది. దేశవ్యాప్తంగా 130 పట్టణ స్థానిక సంస్థలు పాల్గొన్న ఈ సర్వేక్షణలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని...