కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నల్లగొండ, సెప్టెంబర్ 1: ప్రభుత్వ వైద్య కళాశాల, నల్లగొండలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. సత్యనారాయణ వెల్లడించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ వంటి పోస్టులకు నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 26, ట్యూటర్ పోస్టులు 11, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 9 ఉండగా, ఈ నియామకాలు 31-03-2027 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగనున్నాయి. అర్హత, ఆసక్తి గల...