కష్టాల మధ్య చదువు.. NEETలో సత్తా చాటిన నకిరేకల్ విద్యార్థి
నల్లగొండ, సెప్టెంబర్ 15, విజయ కెరటం ప్రతినిధి: కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నా.. లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగుతూ చదువునే తన ఆయుధంగా చేసుకున్న నకిరేకల్‌కు చెందిన అబూబకర్ సిద్ధిఖ్ నీట్ ఫలితాల్లో ప్రతిభ చూపించాడు. అబూబకర్ తండ్రి మౌలానా అక్బర్ గతేడాది మృతి చెందారు. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలోనూ అబూబకర్ తన చదువును కొనసాగించాడు. పరిస్థితులు ఎన్ని ఎదురైనా వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో నిరంతరం కష్టపడ్డాడు. ఈ క్రమంలో నిర్వహించిన NEET పరీక్షలో...