సాయంత్రంలోగా రాజీనామా డెడ్‌లైన్ మంత్రి పదవికి గుడ్‌బై చెప్పనున్న సురేఖ

కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి కొండా సురేఖపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సాయంత్రం లోపు రాజీనామా సమర్పించకపోతే, లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హెచ్చరిక చేసినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేలోపే సురేఖ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బర్తరఫ్ అవడం కంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే మంచిదని కొండా సురేఖ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు...