తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయ కెరటం ప్రతినిధి): తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, మార్పులపై రాజకీయ వర్గాల్లో చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను భేటీ అయి మంత్రివర్గ సంబంధిత అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడంతో పాటు అవసరమైతే కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ భేటీలో కీలక అంశాలు: గురువారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో మంత్రివర్గ ఖాళీలు, తాజా రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా మంత్రి...