వన్డేల్లో విరాట్ కోహ్లీ చరిత్ర.. 15 వేల పరుగుల మైలురాయి!
తిరువనంతపురం: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘనతను సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 15,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో వన్డేల్లో ఈ ఘనత సాధించిన ప్రపంచంలో రెండో బ్యాటర్‌గా నిలిచాడు. కోహ్లీ 303వ ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును చేరుకోవడం విశేషం. 15 వేల పరుగుల మార్క్‌ను చేరుకోవడానికి సచిన్ టెండూల్కర్ 377 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. కోహ్లీ కేవలం 303 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. సచిన్ 18,426 పరుగులతో వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డును...