అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. తీర ప్రాంతాల్లో హై అలర్ట్!

అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. తీర ప్రాంతాల్లో హై అలర్ట్ విజయ కెరటం: అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తుండగా, పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యానాం నియోజకవర్గం అంతటా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో గాలుల తీవ్రత కనిపిస్తోంది. రాజమండ్రిలోనూ బలమైన ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఈదురు...