VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 20 October 2026, 11:51 am Posted by : VIJAYA KERATAM

తిప్పర్తిలో దుర్గామాత విగ్రహాలను సందర్శించిన బద్దం సుధీర్

తిప్పర్తిలో దుర్గామాత విగ్రహాలను సందర్శించిన బద్దం సుధీర్

తిప్పర్తి (విజయ కెరటం):

 

శ్రీశ్రీశ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తిప్పర్తి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, నాగభూషణంగూడెం, నూకలవారిగూడెం కాలనీలలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలను యూత్ కాంగ్రెస్ తిప్పర్తి మండల అధ్యక్షుడు బద్దం సుధీర్ సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ తిప్పర్తి మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.