ఖాకీ దుస్తుల్లో మానవత్వం పేదలకు అన్నదానం చేస్తున్న బోరబండ కానిస్టేబుల్

హైదరాబాద్: బోరబండ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మందుల కుమార్ తనలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. నిరుపేదలకు ఆహారం అందిస్తూ ఆకలితో ఉన్నవారి కడుపు నింపేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. పోలీస్ విధులతో పాటు సామాజిక సేవలోనూ భాగస్వామిగా నిలుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విధి నిర్వహణలో పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఆహారం అందిస్తూ తనలోని సేవా భావాన్ని చాటుకుంటున్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదనే భావనతో పేదలకు భోజనం...