నల్లగొండలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం

నల్లగొండలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నల్లగొండ (విజయ కెరటం):   నల్లగొండ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.   కార్యక్రమంలో భాగంగా ఉదయం 8:40 గంటలకు పరేడ్ ప్రారంభమవుతుంది. 8:45 గంటలకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్‌కు గౌరవ వందనం సమర్పించనున్నారు. ఉదయం 8:50 గంటలకు జిల్లా కలెక్టర్...