నిరుద్యోగ యువతకు ఉచిత ఏసీ రిపేరింగ్, ఫ్రిజ్ సర్వీసింగ్ శిక్ష
నల్గొండ, అక్టోబర్ 29 (విజయ కెరటం):
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (SBI-RSETI), నల్గొండ ఆధ్వర్యంలో ఏసీ రిపేరింగ్, ఫ్రిజ్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమం 30 రోజుల పాటు కొనసాగనుంది. 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ గ్రామీణ యువకులు ఈ శిక్షణకు అర్హులు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆసక్తి గల అభ్యర్థులు 2026 నవంబర్ 4వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9701009265 నంబర్‌ను సంప్రదించాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
శిక్షణ కేంద్రం: SBI-RSETI, రామనగర్, మహిళా ప్రాంగణం సమీపంలో, మిర్యాలగూడ రోడ్డు, నల్గొండ.