VIJAYA KERATAM
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 1:24 pm Posted by : VIJAYA KERATAM

ఓటు హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త పోరాటం.. ఛలో ఢిల్లీకి భారీ స్పందన

ఓటు హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త పోరాటం.. ఛలో ఢిల్లీకి భారీ స్పంద

ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రజాస్వామ్య పోరాటం ఆగదు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయ కెరటం): దేశంలో ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న ఈ ఉద్యమానికి వివిధ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపు కోసం ఉపయోగిస్తోందని విమర్శించారు. ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు.

రాహుల్ నాయకత్వంలో మరో సత్యాగ్రహ పోరాటం

మహాత్మా గాంధీ సత్యాగ్రహ స్ఫూర్తితో రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారని మంత్రి అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోరాటం కాదని, దేశ భవిష్యత్తును, పౌరుల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో చేపడుతున్న ఉద్యమమని వివరించారు.

ప్రజల స్పందనను అడ్డుకోలేరు

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసనకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, నిరసనకారులకు రవాణా సదుపాయాల్లో ఆటంకాలు కల్పిస్తూ నిర్బంధాలకు పాల్పడుతోందని కోమటిరెడ్డి విమర్శించారు. అధికారాన్ని ఉపయోగించి రైళ్లను నిలిపివేయగలరేమో కానీ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్న మంత్రి.. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం నెలకొనే వరకు, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామ

ని వెల్లడించారు.