33.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణదివ్యాంగులకు ఉచిత సహాయక పరికరాలు.. నాలుగు రోజుల ప్రత్యేక శిబిరాలు
Advertisement spot_img

దివ్యాంగులకు ఉచిత సహాయక పరికరాలు.. నాలుగు రోజుల ప్రత్యేక శిబిరాలు

Must read

నల్లగొండ, సెప్టెంబర్ 26 (విజయ కెరటం): దివ్యాంగులకు అవసరమైన సహాయక పరికరాలను ఉచితంగా అందించేందుకు నల్లగొండ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు, అంచనా శిబిరాలను నిర్వహించనున్నారు. ALIMCO–హైదరాబాద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఈ శిబిరాలు జరుగుతాయని జిల్లా అధికారులు తెలిపారు.

జిల్లాలోని 33 మండలాలకు చెందిన దివ్యాంగులను శిబిరాల్లో గుర్తించి, అర్హత ఆధారంగా బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, శ్రవణ పరికరాలు, స్మార్ట్ కేన్ తదితర సహాయక పరికరాల కోసం అంచనా వేయనున్నారు.

శిబిరాల వివరాలు:

సెప్టెంబర్ 28: నల్లగొండ డివిజన్ – టీఎన్‌జీవోస్ భవన్, ప్రకాశం బజార్, నల్లగొండ

సెప్టెంబర్ 29: మిర్యాలగూడ డివిజన్ – రైతు వేదిక, ఎంపీడీఓ కార్యాలయం, మిర్యాలగూడ

సెప్టెంబర్ 30: దేవరకొండ డివిజన్ – గిరిజన భవన్, దేవరకొండ

అక్టోబర్ 1: చందూర్ డివిజన్ – తహసీల్దార్ కార్యాలయం, చందూర్

తీసుకురావాల్సిన పత్రాలు: సదరం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం లేదా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, UDID కార్డు తదితర పత్రాలను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. దివ్యాంగులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.