Homeతెలంగాణనల్లగొండలో 12 ఏళ్ల బాలుడు అదృశ్యం
Advertisement spot_img

నల్లగొండలో 12 ఏళ్ల బాలుడు అదృశ్యం

Must read

నల్లగొండలో 12 ఏళ్ల బాలుడు షారుక్ ఖాన్ మహమ్మద్ కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. ముంబయికి చెందిన బాలుడి తండ్రి పేరు మహమ్మద్ వకీల్‌గా పేర్కొన్నారు.

వివరాల ప్రకారం.. రైల్వే పోలీసులకు బాలుడు దొరకడంతో ఈ నెల 13న గంధవారిగూడెంలోని రోగట్టె స్నేహ భావన ఆశ్రమంలో చేర్పించారు. అయితే ఈ నెల 15న బాలుడు ఆశ్రమం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

ప్రస్తుతం బాలుడు నల్లగొండ ఓల్డ్ సిటీ, మాన్యమచెలక ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. బాలుడు కలర్ బనియన్, చిన్న షార్ట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు.

బాలుడి ఆచూకీ తెలిసిన వారు ఆలస్యం చేయకుండా నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

సంప్రదించాల్సిన నంబర్లు:

📞 నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్: 8712667670

📞 ఎస్‌ఐ జె. సైదులు: 8712577228

- Advertisement -spot_img

More articles

Latest article