Homeతెలంగాణవల్లభరావు చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన
Advertisement spot_img

వల్లభరావు చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన

Must read

నల్గొండ పట్టణ సమీపంలోని వల్లభరావు చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి మంగళవారం రాత్రి పరిశీలించారు.

వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు, బ్యారికేడింగ్, లైటింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్.. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం సజావుగా జరిగేందుకు వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని విధుల్లో నియమించామని, వారంతా విధులకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. జీతగాళ్లు, పోలీస్, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

అనంతరం ఎస్పీ శరత్ చంద్ర పవార్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

Latest article