HomeతెలంగాణTGTET ఇన్‌-సర్వీస్‌ 2026 ఫలితాలు విడుదల
Advertisement spot_img

TGTET ఇన్‌-సర్వీస్‌ 2026 ఫలితాలు విడుదల

Must read

  • 70.07 శాతం ఉత్తీర్ణత.. 15,749 మంది అర్హత
  • హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయ కెరటం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET–In-Service Teachers–2026) ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, TGTET ఛైర్‌పర్సన్‌ శనివారం ఫలితాలను ప్రకటించారు.
  • జూలై 21న విడుదలైన నోటిఫికేషన్‌ ప్రకారం సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో మూడు విడతల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించారు. మొత్తం 24,986 మంది దరఖాస్తు చేసుకోగా.. 22,477 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15,749 మంది అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 70.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
  • పేపర్‌-1లో 4,942 మంది పరీక్షకు హాజరుకాగా 3,398 మంది (68.76%) ఉత్తీర్ణులయ్యారు. పేపర్‌-2 గణితం, సైన్స్‌లో 9,131 మందికి 6,720 మంది (73.60%), పేపర్‌-2 సోషల్‌ స్టడీస్‌లో 8,404 మందికి 5,631 మంది (67%) అర్హత సాధించారు.
  • అభ్యర్థులు తమ ఫలితాలు, మార్కుల వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సమీపంలోని మీ-సేవ కేంద్రాల ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
- Advertisement -spot_img

More articles

Latest article