నలగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో మన ప్రియతమ నేత, మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని ఈరోజు నిమజ్జనానికి తరలించారు.
ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.
నల్లగొండ మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి శోభాయాత్ర కొనసాగుతోంది.


