27.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణజర్నలిస్టుల హక్కుల కోసం గన్‌పార్క్‌కు కదలిరండి! అక్టోబర్‌ 2న దేశవ్యాప్త ఆందోళనను విజయవంతం చేద్దాం
Advertisement spot_img

జర్నలిస్టుల హక్కుల కోసం గన్‌పార్క్‌కు కదలిరండి! అక్టోబర్‌ 2న దేశవ్యాప్త ఆందోళనను విజయవంతం చేద్దాం

Must read

హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (విజయ కెరటం): జర్నలిస్టుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్‌ 2న హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్క్‌ వద్ద నిర్వహించనున్న దేశవ్యాప్త ఆందోళనకు జర్నలిస్టులు భారీగా తరలిరావాలని తెలంగాణ స్మాల్‌ అండ్‌ మీడియం న్యూస్‌పేపర్స్‌ అండ్‌ మ్యాగజైన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్‌ బాబు పిలుపునిచ్చారు.

ఐజేయూ జాతీయ కమిటీ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ ఆందోళనలో చిన్న, మధ్యతరహా దినపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికల సంపాదకులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాల్లోని జర్నలిస్టులు సైతం టీయూడబ్ల్యూజే–ఐజేయూతో కలిసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని యూసుఫ్‌ బాబు, అశోక్‌ అజామ్‌ ఖాన్‌ పేర్కొన్నారు. ప్రతి జర్నలిస్టు అక్టోబర్‌ 2న గన్‌పార్క్‌ వద్ద జరిగే ఆందోళనలో భాగస్వామి కావాలని వారు కోరారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.