Monday, October 26, 2026
Google search engine
Homeతెలంగాణజిల్లా ప్రజలకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ దసరా శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ దసరా శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

జిల్లా ప్రజలకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ దసరా శుభాకాంక్షలు

సూర్యాపేట (విజయ కెరటం స్టేట్ బ్యూరో – గౌస్):

 

విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ ప్రతి ఇంటా ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు.

 

దృఢమైన సంకల్పం, పట్టుదలతో ముందుకు సాగితే విజయం తప్పక సాధ్యమవుతుందని ఈ పండుగ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. దుర్గాదేవి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని, చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, సానుకూల ఆలోచనలు, విజయాలను తీసుకురావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.