Sunday, October 25, 2026
Google search engine
Homeఆధ్యాత్మికంపానగల్ ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధికి రూ.20 కోట్లు

పానగల్ ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధికి రూ.20 కోట్లు

📰 Generate e-Paper Clip

పానగల్ ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధికి రూ.20 కోట్లు

### మంత్రి కోమటిరెడ్డికి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు

నల్గొండ, అక్టోబర్ 23 (విజయ కెరటం): నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోని చారిత్రాత్మక పానగల్ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం, పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, సుందరీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేసింది.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదన మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) మేనేజింగ్ డైరెక్టర్‌కు ఈ నిధులు విడుదలకు అనుమతి లభించింది. ఈ నిధులతో దేవాలయ పరిసరాల సుందరీకరణ, సమీప జలవనరుల అభివృద్ధి, పర్యాటక మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు చేపట్టనున్నారు. పానగల్‌ను వారసత్వ, ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

### చరిత్రకు సజీవ సాక్ష్యం పానగల్ దేవాలయాలు: మేయర్

నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పానగల్‌లోని పచ్చల సోమేశ్వర, ఛాయా సోమేశ్వర దేవాలయాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలని అన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


ఈ నిధులు ఆలయ పరిసరాల సుందరీకరణ, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పానగల్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం కీలకమని తెలిపారు. చారిత్రక ఆలయాల పరిరక్షణతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, పానగల్ ప్రాంత అభివృద్ధికి ఈ నిధుల మంజూరు కీలక ముందడుగుగా నిలుస్తుందని మేయర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.