Sunday, October 25, 2026
Google search engine
Homeతెలంగాణదేవరకొండలో వీధికుక్కల బెడద.. చిన్నారిపై దాడి

దేవరకొండలో వీధికుక్కల బెడద.. చిన్నారిపై దాడి

📰 Generate e-Paper Clip

దేవరకొండ: పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కల బెడద పెరిగింది. 11వ వార్డులో ఇటీవల ఓ చిన్నారిపై వీధికుక్కలు దాడి చేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారిని కుక్కలు తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. ఈ ఘటనతో కాలనీవాసుల్లో భయాందోళన నెలకొంది. ప్రధానంగా పాఠశాలలు, నివాస ప్రాంతాల్లో వీధికుక్కల సంచారం పెరగడంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

వీధికుక్కల బెడదను అరికట్టేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కుక్కల నియంత్రణతో పాటు, ప్రమాదకరంగా సంచరిస్తున్న కుక్కలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.