నల్లగొండ, సెప్టెంబర్ 24 (విజయ కెరటం):
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ గురువారం నల్లగొండలోని ఇదారా-ఎ-ఇక్వామత్ ఖానా బహదూర్ ఖాన్ సొసైటీని సందర్శించారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో ఆయన ఈ పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా ఇడారా అధ్యక్షుడు షాహెద్ అహ్మద్ బ్రదర్ షఫీని ఘనంగా సన్మానించారు. అనంతరం బ్రదర్ షఫీ మాట్లాడుతూ.. అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని గ్రాడ్యుయేట్లను విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఇడారా ఉపాధ్యక్షుడు ఖాజా మొయినుద్దీన్, కార్యదర్శి మహ్మద్ షఫీ నవాజ్ ఖాన్, సంయుక్త కార్యదర్శి మహ్మద్ మునీరుద్దీన్, కార్యవర్గ సభ్యులు ముబారిజుద్దీన్ సాబేర్, ముబీన్ అన్సారీ, సయ్యద్ రఫీ అహ్మద్, మహ్మద్ నసీర్, మహ్మద్ జాఫర్, ఫహీమ్, సూర్యాపేటకు చెందిన ముఫ్తీ అస్రార్ సాహెబ్, ఇమామ్-ఓ-ఖారీ నజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


