29.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోండి: జమియత్ తెలంగాణ అధ్యక్షుడు
Advertisement spot_img

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోండి: జమియత్ తెలంగాణ అధ్యక్షుడు

Must read

వరంగల్–ఖమ్మం–నల్గొండ, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సంఘం కొత్త ఓటరు జాబితా నమోదు ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని జమియత్‌-ఎ-ఉలమా-ఎ-హింద్ తెలంగాణ అధ్యక్షుడు హజ్రత్ మౌలానా సయ్యద్ ఎహ్సానుద్దీన్ సాహెబ్ విజ్ఞప్తి చేశారు.

గతంలో గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదైన వారు కూడా ఈసారి Form-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. 2026 నవంబర్ 6 Form-18 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో పేర్కొంది.

తెలంగాణలో సుమారు 3.5 లక్షల మంది ముస్లిం గ్రాడ్యుయేట్లు ఉన్నప్పటికీ, తనకు అందిన సమాచారం ప్రకారం కేవలం 40–45 వేల మంది మాత్రమే గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారని మౌలానా ఎహ్సానుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ Form-18 పూర్తి చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటు హక్కును నమోదు చేసుకోండి.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.