29.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణమనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు
Advertisement spot_img

మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు

Must read

27న విచారణకు హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయ కెరటం): సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 27న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

సాహితి ఇన్‌ఫ్రా నుంచి ఎమ్మెల్యేకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లోకి సుమారు రూ.2.1 కోట్లు బదిలీ అయినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ లావాదేవీల స్వభావం, ఉద్దేశం, వాటికి సంబంధించిన ఆర్థిక సంబంధాలపై ఈడీ అధికారులు వివరాలు సేకరించనున్నారు.

సాహితి ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు, విల్లాలు నిర్మిస్తామని చెప్పి ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి భారీగా నిధులు సేకరించి మళ్లించారనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. తొలుత సుమారు రూ.248 కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలు రాగా, తదుపరి దర్యాప్తులో నేరపూరిత ఆదాయం సుమారు రూ.842 కోట్లకు చేరినట్లు ఈడీ అంచనా వేసింది.

ఈ కేసులో ఇప్పటివరకు 56 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు, రూ.161 కోట్ల విలువైన ఆస్తులతో పాటు మరో రూ.12.6 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. సంస్థ ఎండీ బి. లక్ష్మీనారాయణను 2024 సెప్టెంబర్‌లో ఈడీ అరెస్ట్ చేసింది.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.