29.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలు
Advertisement spot_img

గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలు

Must read

నల్లగొండ, సెప్టెంబర్ 22 (విజయ కెరటం ప్రతినిధి): నల్లగొండ జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు, ఇతర భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు తమ విగ్రహాల ఎత్తును ముందుగానే పరిశీలించుకుని, నిర్దేశించిన నిమజ్జన ప్రదేశాలకు అనుగుణంగా రూట్ ప్లాన్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నందున 10 అడుగులకు మించిన గణేష్ విగ్రహాలను ఈ ఏడాది 14వ మైలు, హాలియా వైపు అనుమతించబోమని తెలిపారు.

విగ్రహాల ఎత్తును బట్టి నిమజ్జన మార్గాలు:

10 అడుగుల ఎత్తు వరకు ఉన్న విగ్రహాలు: బతుకమ్మ కుంట / వల్లభరావు చెరువులో నిమజ్జనం చేసుకోవాలి.

10 అడుగులకు పైగా ఉన్న విగ్రహాలు: క్లాక్ టవర్ – రామగిరి – పానగల్ ఫ్లైఓవర్ – తిప్పర్తి – వేములపల్లి మార్గం ద్వారా వేములపల్లి కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశానికి తరలించాలి.

నిమజ్జన సమయంలో భక్తులు, నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలకు అనుగుణంగా శోభాయాత్రలు నిర్వహించాలని కోరారు.

డీజేలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. మద్యం సేవించి గణేష్ ఊరేగింపుల్లో పాల్గొనరాదని, వాహనదారులు వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవింగ్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ ఏడాది “జీరో యాక్సిడెంట్ – జీరో ఇన్సిడెంట్” లక్ష్యంతో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు పోలీస్ శాఖకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.