Sunday, October 25, 2026
Google search engine
Homeతెలంగాణపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

📰 Generate e-Paper Clip

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

 

  • ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

నల్లగొండ, అక్టోబర్ 21 (విజయ కెరటం):

 

నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు ఘనంగా నివాళులర్పించారు.

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల ధైర్యం, కర్తవ్యనిష్ఠ, అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. నేరాల నియంత్రణ, మహిళలు, బాలల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన, మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసుల కృషి అభినందనీయమన్నారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

 

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, పోలీస్ విధి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజల పట్ల బాధ్యత, దేశం పట్ల నిబద్ధతతో కూడిన పవిత్రమైన కర్తవ్యమని అన్నారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది వీరమరణానికి గుర్తుగా ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

నల్లగొండ జిల్లాలో విధి నిర్వహణలో ఇప్పటివరకు 15 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది అమరులయ్యారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 154 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అమరులైన పోలీసుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని, వారి సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

 

అనంతరం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు గౌరవాభివందనాలు తెలియజేశారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల భద్రత, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ కె. శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.