- పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రవి నాయక్ ఏకగ్రీవ ఎన్ని
కరీంనగర్, అక్టోబర్ 19 (విజయ కెరటం): పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బోర్నపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు రవి నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్లగొండలో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన ఎన్నికను ప్రకటించారు.
హుజూరాబాద్ మండలం నుంచి రాష్ట్ర కార్యవర్గంలోకి రవి నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముసుకు తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వేముల లక్ష్మీనారాయణ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై మంచి అవగాహనతో పాటు బోధనలో క్రమశిక్షణ కలిగిన రవి నాయక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎంపిక కావడం పట్ల తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
తన ఎన్నికకు సహకరించిన హుజూరాబాద్ పీఆర్టీయూ అధ్యక్షురాలు భాగ్యరేఖ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌కు రవి నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.




