29.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణదేవరకొండ మండలం, కొమ్ము తండా లోని భీమనపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని...
Advertisement spot_img

దేవరకొండ మండలం, కొమ్ము తండా లోని భీమనపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు.

Must read

  • దేవరకొండ మండలం, కొమ్ము తండా లోని భీమనపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు

ఆదివారం అయన జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ తో కలిసి కొమ్ము తండా భీమనపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదని, లైటింగ్ ,గజ ఈతగాళ్లు, క్రేన్లు అన్ని ఏర్పాట్లు చేయాలని ,ఎప్పటికప్పుడు శానిటేషన్ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, తాగునీరు ,ప్రథమ చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. నిమజ్జనం చేసే వినాయకులకు సంబంధించి ఒక రిజిస్టర్ ఏర్పాటు చేయాలని, కొమ్ముతాండ చెరువుకు వచ్చే విగ్రహాల ను రిజిస్టర్లో నమోదు చేయాలని, విగ్రహాలు నిమజ్జనం చేసిన వెంటనే పారిశుద్ధ్య కార్మికుల ద్వారా చెత్తను బయటికి తీసివేయాలని ,చెత్త కోసం ప్రత్యేకంగా డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని ,ఎలాంటి ప్రమాదం సంభవించకుండా గజఈత గాళ్లను సిద్ధంగా ఉంచాలని, అలాగే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆర్ డబ్ల్యు ఎస్ ద్వారా తాగునీరు, విద్యుత్ శాఖ ద్వారా నిరంతరం విద్యుత్తు అందించాలని, ఏర్పాట్ల సందర్భంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకూడదన్నారు.

దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావి, డి.ఎస్.పి ,ఇతర శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.