27.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణజర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం పోస్టుకార్డుల ఉద్యమాన్ని విజయవంతం చేయాలి
Advertisement spot_img

జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం పోస్టుకార్డుల ఉద్యమాన్ని విజయవంతం చేయాలి

Must read

టీయూడబ్ల్యూజే(143) జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్

తిప్పర్తి, అక్టోబర్ 1 (విజయ కెరటం): జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే(143) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారం రోజుల పోస్టుకార్డుల ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ పిలుపునిచ్చారు.

గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే(143) తిప్పర్తి మండల కమిటీని అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా టీయూడబ్ల్యూజే(143) పనిచేస్తోందని తెలిపారు. గతంలో హెల్త్ కార్డుల సాధనతో పాటు మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం, వారి పిల్లల విద్యకు చేయూత అందించినట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో అల్లం నారాయణ ఆధ్వర్యంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రస్తుతం జర్నలిస్టుల హెల్త్ కార్డులు కొన్ని ఆసుపత్రులకు మాత్రమే పరిమితమయ్యాయని, రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జయశంకర్ గౌడ్ డిమాండ్ చేశారు.

నూతన కమిటీకి అభినందనలు

టీయూడబ్ల్యూజే(143) తిప్పర్తి మండల నూతన అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు జేరుపోతుల సైదులు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా జంజరాల రవికుమార్ (నమస్తే తెలంగాణ) ఎన్నికైన సందర్భంగా వారిని జయశంకర్ గౌడ్

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.