Sunday, October 25, 2026
Google search engine
Homeతెలంగాణనల్గొండలో బిజినెస్ ట్రాప్ కలకలం.. పెట్టుబడుల పేరుతో మోసం చేశారంటున్న బాధితులు

నల్గొండలో బిజినెస్ ట్రాప్ కలకలం.. పెట్టుబడుల పేరుతో మోసం చేశారంటున్న బాధితులు

📰 Generate e-Paper Clip

నల్గొండ, అక్టోబర్ 7: విజయ కెరటం ప్రతినిధి

బిజినెస్ పేరుతో పెట్టుబడులు సేకరించి మోసం చేస్తున్నారంటూ నల్గొండలో పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ముందుగా పరిచయాలు పెంచుకుని, వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించి డబ్బులు తీసుకుంటున్నారని, ప్రారంభంలో కొంతకాలం లాభాలు చెల్లించి నమ్మకం పెంచుకున్న తర్వాత అసలు మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు.

మూడు నెలల పాటు లాభాలు చెల్లించి, నాలుగో నెలలో డబ్బులు ఇవ్వకుండా, ఆ తర్వాత అందుబాటులో లేకుండా పోతున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడులు పెట్టిస్తున్నారని చెబుతున్నారు. కొందరు కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులతో పాటు భార్య పిల్లల నగలను సైతం తాకట్టు పెట్టి పెట్టుబడులు పెట్టి నష్టపోయినట్లు బాధితులు పేర్కొంటున్నారు.

తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, కొందరు తమపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసం సంబంధిత వ్యక్తుల ఇళ్లకు వెళ్తే మహిళలను అడ్డుపెట్టి తమపైనే కిడ్నాప్, వేధింపులు వంటి కేసులు పెట్టిస్తున్నారని వాపోతున్నారు.

ఇలాంటి బిజినెస్ ట్రాప్‌లో పడి డబ్బులు కోల్పోయిన వారు పలువురు ఉన్నారని, తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక భయాందోళనకు గురవుతున్నామని బాధితులు అంటున్నారు.

బిజినెస్ పేరుతో పెట్టుబడులు సేకరిస్తున్న వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి, బాధితుల ఫిర్యాదులను పరిశీలించాలని వారు నల్గొండ పోలీసులను కోరుతున్నారు. ఆరోపణల్లో వాస్తవాలను విచారించి, మోసానికి పాల్పడినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.