రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, అక్టోబర్ 19 (విజయ కెరటం):
రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
దసరా పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐకమత్యంతో పండుగలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
రైతులు, కార్మికులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను తీసుకురావాలని కోరారు. పరస్పర ప్రేమాభిమానాలు, సోదరభావం, మానవతా విలువలను పెంపొందించుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజల ఆశయాలు నెరవేరాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.




