నల్లగొండ, ఆగస్టు 29: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది.
29వ డివిజన్ AIMIM కార్పొరేటర్ మొహమ్మద్ ఖాజా సమీయొద్దీన్ (నదీమ్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని Gleneagles Hospitals – Fortis Network Hospitals వైద్యుల సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిబిరంలో ప్రజలకు గుండె, కిడ్నీ, జనరల్ ఫిజిషియన్, టూ-డీ ఎకో, ECG, బీపీ తదితర వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అలాగే కంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించి, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలపై సూచనలు అందించారు.
శిబిరానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. 29వ డివిజన్ ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.


