నల్లగొండ, సెప్టెంబర్ 11 (విజయ కెరటం ప్రతినిధి):
నల్లగొండ పట్టణంలోని బండారు గార్డెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (TRSMA) ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
విశ్వభారవి ఫౌండేషన్ స్కూల్, BTS నల్లగొండ డైరెక్టర్ కమ్ సీఈవో జెరిపోతుల రవికుమార్, స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) మునగాల మురళి, సెకండరీ గ్రేడ్ టీచర్ ఉమ్మి ఐమాన్లను నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి చేతుల మీదుగా సన్మానించారు.
కార్యక్రమంలో వివిధ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


