29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణసెప్టెంబర్‌ 10న ‘చలో హైదరాబాద్‌’.. ఉద్యోగుల మహాధర్నా
Advertisement spot_img

సెప్టెంబర్‌ 10న ‘చలో హైదరాబాద్‌’.. ఉద్యోగుల మహాధర్నా

Must read

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8: తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (TGEJAC) ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లో ‘చలో హైదరాబాద్‌ – మహాధర్నా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని TGEJAC నాయకులు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సమాహార శాఖల ఆధ్వర్యంలో ‘లంచ్‌ అవర్‌ డెమోన్స్ట్రేషన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగుల ప్రధాన సమస్యలైన PRC అమలు, 6 DAలు విడుదల, CPS రద్దు చేసి OPS అమలు, GPF బకాయిల చెల్లింపు, EHS పథకం ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై ప్రభుత్వం స్పందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

సెప్టెంబర్‌ 10న జరిగే మహాధర్నాను విజయవంతం చేసేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలిరావాలని TGEJAC నాయకులు కోరారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.