డివైడర్ అస్తవ్యస్తంగా.. ప్రమాదాలకు అవకాశం
ఇక్బాల్ మినార్ నుంచి ఎస్‌ఆర్ గార్డెన్ వరకు సమస్యకు పరిష్కారం కోరుతూ వినతి
నల్లగొండ, సెప్టెంబర్ 7:
మిర్యాలగూడ రోడ్డులోని ఇక్బాల్ మినార్ నుంచి ఎస్‌ఆర్ గార్డెన్ వరకు రహదారి డివైడర్ నిర్వహణ, ఓపెనింగ్స్ సక్రమంగా లేకపోవడంతో వాహనదారులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు ప్రజా వినతిపత్రం సమర్పించారు.
డివైడర్ సక్రమంగా లేకపోవడం, అవసరమైన చోట్ల సరైన మార్గాలు లేకపోవడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడటంతో పాటు ప్రమాదాల ముప్పు పెరుగుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
వెంటనే సంబంధిత అధికారులతో రహదారిని పరిశీలించి, డివైడర్‌ను సక్రమంగా ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో తగిన ఓపెనింగ్స్ ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలు సాఫీగా, సురక్షితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కమ్యూనిటీ ప్రతినిధులు పాల్గొని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సమస్యపై అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.


