నల్లగొండ: పంచాయతీరాజ్ ఉద్యోగుల ఐక్యతతోనే సమస్యలను వేగంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ అధికారులుగా అవార్డులు పొందిన పంచాయతీరాజ్ ఉద్యోగులను సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా సన్మానించారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రేమ్ కరణ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు బాధ్యతతో పనిచేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతాయని తెలిపారు.
పంచాయతీరాజ్ శాఖలోని అన్ని సంఘాల ఐక్యతతో ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతమైందని, జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీడీవోల నియామకం పూర్తయిందని చెప్పారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి అలివేలు మంగమ్మ, నల్లగొండ జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమేశ్, జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ చారి, ఉద్యోగులు హరినాథ్, శ్రీను, ప్రవీణ్, విజయ్, శోభ, విజయ భాస్కర్ రెడ్డి, రజిత, స్నేహ, ప్రకాష్, ఎండి గులాం రబ్బాని, రేణుక, రేఖ, భాగ్యలత తదితరులు పాల్గొన్నారు.


