ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా.. చెల్లింపుపై స్పష్టత కరువు
అకాల మరణం చెందిన రైతు కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతుబీమా పథకాన్ని ప్రారంభించింది. ఎల్‌ఐసీ భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందుతోంది.
ప్రతి ఏడాది ఆగస్టు 14లోపు రైతుబీమా ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, 2026–27 సంవత్సరానికి సంబంధించిన సుమారు రూ.1,400 కోట్ల ప్రీమియం చెల్లింపు ఇంకా జరగలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 42.16 లక్షల మంది రైతులు ఈ పథకం పరిధిలో ఉన్న నేపథ్యంలో, ప్రీమియం చెల్లింపుపై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
రైతుబీమా కొనసాగింపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.


