29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణరూపా రెడ్డి హత్యపై నిరసన.. 21న ప్రైవేట్ పాఠశాలల బంద్
Advertisement spot_img

రూపా రెడ్డి హత్యపై నిరసన.. 21న ప్రైవేట్ పాఠశాలల బంద్

Must read

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనకు నిరసనగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆగస్టు 21న పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి.

గురువులపై దాడులు, హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రూపా రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.