హైదరాబాద్: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ది హాన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇండియా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, జాతీయస్థాయి మీడియా ఎడిటర్ల చేతుల మీదుగా శ్రీనివాస్ గౌడ్ అవార్డును అందుకున్నారు.
ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభకు గుర్తింపుగా లభించిన ఈ అవార్డుపై శ్రీనివాస్ గౌడ్‌కు పలువురు జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.


