25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణమాదాపూర్‌లో కుప్పకూలిన ఏడంతస్తుల అక్రమ భవనం
Advertisement spot_img

మాదాపూర్‌లో కుప్పకూలిన ఏడంతస్తుల అక్రమ భవనం

Must read

హైదరాబాద్: మాదాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. అంజయ్యనగర్‌లో నాలా పక్కనే కేవలం 50 గజాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

భవనం కూలి పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడటంతో ఆ భవనం కూడా దెబ్బతింది. ఘటనలో పలువురికి గాయాలు కాగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

కేవలం 50 గజాల స్థలంలో, అదీ నాలా పక్కనే ఏడంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారంటూ స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.