25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణనల్గొండనల్లగొండ టూ టౌన్ కానిస్టేబుల్‌ షకీల్‌కు బెస్ట్ అవార్డు
Advertisement spot_img

నల్లగొండ టూ టౌన్ కానిస్టేబుల్‌ షకీల్‌కు బెస్ట్ అవార్డు

Must read

నల్లగొండ: జిల్లాలో డ్రగ్స్ మాఫియాను అరికట్టడంలో విశేష ప్రతిభ కనబరిచిన నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మొహమ్మద్ షకీల్ అరుదైన గుర్తింపు పొందారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచుతూ కీలక కేసుల్లో చురుగ్గా వ్యవహరించినందుకు ఆయనకు బెస్ట్ అవార్డు లభించింది.

అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ శాండిల్య చేతుల మీదుగా మొహమ్మద్ షకీల్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.

జిల్లాలో యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు నల్లగొండ పోలీసులు చేపడుతున్న చర్యల్లో షకీల్ కీలక పాత్ర పోషించారని అధికారులు ప్రశంసించారు. డ్రగ్స్ విక్రయాలు, సరఫరా, వినియోగంపై నిరంతరం నిఘా ఉంచుతూ అనేక కీలక కేసుల ఛేదనలో ఆయన చురుకుగా పనిచేశారని తెలిపారు.

ఈ సందర్భంగా కానిస్టేబుల్ మొహమ్మద్ షకీల్‌ను నల్లగొండ టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై డి. సైదాబాబు అభినందించారు. షకీల్‌కు బెస్ట్ అవార్డు దక్కడంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.