29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణనల్గొండనల్లగొండలో విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
Advertisement spot_img

నల్లగొండలో విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

Must read

నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. దేవరకొండ రోడ్డు నుంచి గంధం వారి గూడెం వెళ్లే మార్గంలో ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో రాజు అనే వ్యక్తికి కరెంట్ షాక్ తగిలింది.

విద్యుత్ షాక్ తీవ్రతకు రాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి, పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.