25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణనల్గొండమానవత్వం చాటుకున్న నకిరేకల్ ముస్లింలు
Advertisement spot_img

మానవత్వం చాటుకున్న నకిరేకల్ ముస్లింలు

Must read

కట్టంగూరు బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి.. ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు

కట్టంగూరు బస్టాండ్‌లో సుమారు 60 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని ముస్లిం వ్యక్తి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కట్టంగూరు పోలీసులు కేసు నమోదు చేసి, ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు నకిరేకల్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్‌ను సంప్రదించారు.

దీనిపై స్పందించిన అసోసియేషన్ అధ్యక్షుడు Md ఫహీమ్, ప్రధాన కార్యదర్శి MD నవీద్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ముందుకు వచ్చారు. మత గురువు మౌలానా అహ్మద్ సాహెబ్ సహకారంతో, కట్టంగూరు పోలీసుల సమన్వయంతో మృతుడికి గౌరవప్రదంగా ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసులు అసోసియేషన్ సభ్యులను అభినందిస్తూ.. మతం, కులం, ఆర్థిక స్థితి కంటే మానవత్వమే గొప్పదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు లేని వ్యక్తికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడం అభినందనీయమని తెపాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.