25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణఉచిత మెగా హెల్త్ క్యాంప్
Advertisement spot_img

ఉచిత మెగా హెల్త్ క్యాంప్

Must read

తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల కోసం ఈ నెల 26న తిరుమలగిరిలో ఉచిత వైద్య శిబిరం

తిరుమలగిరి (విజయ కెరటం జర్నలిస్ట్ గౌస్): తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల కోసం ఈ నెల 26న తిరుమలగిరి పట్టణంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు కృష్ణవేణి ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్‌చార్జి సూరారపు కృష్ణవేణి తెలిపారు.

సింధు హాస్పిటల్, హైటెక్ సిటీ వైద్యుల ఆధ్వర్యంలో కృష్ణవేణి ఫౌండేషన్, శంకరయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శిబిరంలో ప్రముఖ వైద్యుల బృందం పాల్గొని క్యాన్సర్, కార్డియాక్, గైనకాలజీ తదితర విభాగాలకు సంబంధించిన వైద్య పరీక్షలతో పాటు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

తిరుమలగిరి పట్టణంలోని లిటిల్ ఫాతిమా స్కూల్లో జరిగే ఈ మెగా హెల్త్ క్యాంప్‌ను తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కృష్ణవేణి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.