Monday, October 26, 2026
Google search engine
Homeతెలంగాణ5 రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం! సెప్టెంబర్ 28 నుంచి సమ్మె

5 రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం! సెప్టెంబర్ 28 నుంచి సమ్మె

📰 Generate e-Paper Clip

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 22న జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను కొనసాగించాలని యూనియన్లు నిర్ణయించాయి.

వారానికి ఐదు రోజుల పనిదినాల అమలు ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఈ అంశంపై ప్రభుత్వం పరిశీలనలో ఉందని తెలిపినప్పటికీ, స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నట్లు UFBU పేర్కొంది.

సెప్టెంబర్ 26న రెండో శనివారం, 27న ఆదివారం కావడంతో.. సమ్మె రోజులతో కలిపి సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖల ప్రత్యక్ష సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే అన్ని బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోతాయని కాదు; ATMలు, UPI, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

అత్యవసరమైన బ్యాంకు పనులు ఉన్న ఖాతాదారులు సెప్టెంబర్ 28కు ముందే పూర్తి చేసుకోవాలని పలు బ్యాంకులు సూచించాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.