Monday, October 26, 2026
Google search engine
Homeతెలంగాణఎంజీఎం దుస్థితిపై సీఎం దృష్టి సారించాలి

ఎంజీఎం దుస్థితిపై సీఎం దృష్టి సారించాలి

📰 Generate e-Paper Clip

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో వరుసగా పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ వార్డులో ఘటన అనంతరం అధికారులు ఆస్పత్రిని పరిశీలించినప్పటికీ, ఆర్‌ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగాల్లోనూ పెచ్చులు ఊడిపడటంతో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

వెయ్యి పడకల ఆస్పత్రిలో రోగులను తరలించేందుకు సరిపడా స్ట్రెచర్లు, సెలైన్‌ స్టాండ్లు అందుబాటులో లేవని ఆరోపణలు ఉన్నాయి. ఏడు అంతస్తుల భవనంలో ఒక్క లిఫ్ట్‌ మాత్రమే పనిచేస్తుండటం, రక్త పరీక్షలకు అవసరమైన రసాయనాల కొరత, 2డీ ఎకో వంటి పరికరాలు పనిచేయకపోవడం వంటి సమస్యలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఆపరేషన్‌ థియేటర్లలో ఏసీలు పనిచేయకపోవడం, నిపుణులైన సిబ్బంది కొరతపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.