నల్గొండ పట్టణంలో జియో ఎయిర్‌ఫైబర్ సేవలు మూడు రోజులుగా నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్నెట్ పనిచేయడం లేదని ఫిర్యాదు చేసినా సిబ్బంది స్పందించలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
మూడు రోజుల తర్వాత జియో కార్యాలయాన్ని ఆశ్రయించిన వినియోగదారులకు రూటర్ మారుస్తామని చెప్పి సిబ్బంది రూటర్ తీసుకెళ్లారని, అయితే ఇప్పటివరకు సేవలను పునరుద్ధరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటూ, వెంటనే జియో ఎయిర్‌ఫైబర్ సేవలను పునరుద్ధరించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.


