29.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణటీఎన్జీవోస్ మ్యాక్స్ సొసైటీ ఎన్నికల్లో అధికారిక ప్యానెల్ విజయం
Advertisement spot_img

టీఎన్జీవోస్ మ్యాక్స్ సొసైటీ ఎన్నికల్లో అధికారిక ప్యానెల్ విజయం

Must read

హైదరాబాద్: టీఎన్జీవోస్ మ్యాక్స్ సొసైటీ లిమిటెడ్, గచ్చిబౌలిలో ఖాళీ అయిన రెండు డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో టీఎన్జీవోస్ యూనియన్ అధికారిక ప్యానెల్ అభ్యర్థులు కారం రవీందర్ రెడ్డి, కట్కూరి శ్రీకాంత్ విజయం సాధించారు.

మొత్తం 2,107 మంది సభ్యులకు గాను 867 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 7 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. కారం రవీందర్ రెడ్డికి 583 ఓట్లు, కట్కూరి శ్రీకాంత్‌కు 302 ఓట్లు లభించాయి. ఎన్నికల అధికారి మోహన్ రావు ఇరువురినీ విజేతలుగా అధికారికంగా ప్రకటించారు.

ఎన్నికల సందర్భంగా ఉమాదేవి, గోవర్ధన్ రెడ్డి తమ అభ్యర్థిత్వాలను విరమించుకుని టీఎన్జీవోస్ యూనియన్ అధికారిక ప్యానెల్‌కు మద్దతు తెలిపారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిశాయి.

నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లను కె. స్వామిగౌడ్, సుధాకర్, దేవిప్రసాదరావు, మీమిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్, ముజీబ్, ఎం.ఏ. హమీద్ తదితరులు అభినందించారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.